Delhi liquor Scam: ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన బిల్డర్ శ్రీనివాసరావు

ABN , First Publish Date - 2022-09-20T04:15:42+05:30 IST

బిల్డర్ వెన్నమనేని శ్రీనివాసరావుకు ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. శ్రీనివాసరావును ఢిల్లీ ఈడీ అధికారులు ...

Delhi liquor Scam: ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయిన బిల్డర్ శ్రీనివాసరావు

హైదరాబాద్: బిల్డర్ వెన్నమనేని శ్రీనివాసరావుకు ఈడీ విచారణ ముగిసింది. దీంతో ఆయన ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. శ్రీనివాసరావును ఢిల్లీ ఈడీ అధికారులు  6 గంటల పాటు విచారించారు. మంగళవారం అధికారులు మరోసారి కూడా విచారించనున్నారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రామచంద్రన్‌పిళ్లై, గండ్రా ప్రేమ్‌సాగర్‌తో సంబంధాలపైనా ఆరా తీశారు. పిళ్లై, ప్రేమ్‌సాగర్, శ్రీనివాస్‌రావు కలిసి వ్యాపారాలు చేయడంతో పాటు హవాలా మనీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. శ్రీనివాసరావు కంపెనీ ద్వారా ఢిల్లీకి ఫ్లైట్ టికెట్లు బుక్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే స్కాంలో శ్రీనివాస్‌రావు పాత్రపైనా ఆధారాలు సేకరిస్తున్నారు. 


ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల బుచ్చి బాబు ఇచ్చిన సమాచారంతో బిల్డర్ శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నారు. అంతకుముందు ఈడీ అధికారులు నగరంలో ఏకకాలంలో పలుచోట్ల సోదాలు జరిపారు. బంజారాహిల్స్‌లోని శ్రీనివాస్ ఇంట్లోనూ తనిఖీలు నిర్వహించారు. అలాగే జోనా ట్రావెల్ ఏజెన్సీ, మాదాపూర్ వార్సన్ సాఫ్ట్‌వేర్  కంపెనీతో పాటు ఉప్పల్ సాలిగ్రామ్ టెక్నాలజీస్‌లోనూ తనిఖీలు చేశారు. అయితే సాలిగ్రామ్ ప్రైవేట్ లిమిటెడ్ టెక్నాలజీస్‎తో మనీ లాండరింగ్‌కి శ్రీనివాసరావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. అలాగే అధికార పార్టీ నేతలకు బినామీగా కూడా శ్రీనివాసరావు వ్యవహరించినట్లు అధికారులు గుర్తించారు. 


Updated Date - 2022-09-20T04:15:42+05:30 IST