కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ఈడీ కస్టడీలోకి కీలక నిందితులు

ABN , First Publish Date - 2020-08-06T03:58:02+05:30 IST

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి..

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు: ఈడీ కస్టడీలోకి కీలక నిందితులు

కొచ్చి: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముగ్గురు కీలక నిందితులను ఈడీ తన కస్టడీలోకి తీసుకుంది. వీరిని ఏడు రోజుల పాటు విచారించేందుకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఎర్నాకుళం ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కస్టడీకి వెళ్లిన వారిలో సరత్ పీఎస్, స్వప్నా సురేశ్, సందీప్ నాయర్ ఉన్నారు. కాగా ఇదే కేసులో నిందితులను ఈ నెల 21 వరకు జ్యుడీషియన్ కస్టడీకి అప్పగించిన విషయం తెలిసిందే. గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారంపై ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు కూడా విచారణ చేపట్టారు. గత నెల 5న తిరువనంతపురం అంతర్జాతీయ విమనాశ్రయంలో ఓ ‘‘దౌత్య సంబంధిత’’ బ్యాగులో రూ.15 కోట్ల విలువైన బంగారం పట్టుబడడం సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఇప్పటి వరకు కేంద్ర దర్యాప్తు అధికారులు 15 మందిని అరెస్ట్ చేశారు. 

Updated Date - 2020-08-06T03:58:02+05:30 IST