Jul 2 2021 @ 20:17PM

బాలీవుడ్ న‌టి యామీ గౌత‌మ్‌కు ఈడీ షాక్‌

రీసెంట్‌గానే ‘ఉరి’ చిత్ర ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్‌ను వివాహం చేసుకున్న బాలీవుడ్ హీరోయిన్ యామీ గౌత‌మ్‌కు ఈడీ అధికారులు షాక్ ఇచ్చారు. ఇంత‌కీ ఈమెకు ఈడీ అధికారులు ఎందుకు సమన్లు ఇచ్చార‌నే వివ‌రాల్లోకెళ్తే.. విదేశీ మార‌క నిర్వ‌హ‌ణ చ‌ట్టం(ఫెమా)ను ఉల్లంఘించిన ట్లు ఆరోప‌ణ‌లు రావ‌డంతో అధికారులు ఆమెకు స‌మ‌న్లు జారీ చేశారు. ఇప్ప‌టికే ఓసారి ఈడీ నుంచి ఇలాంటి స‌మ‌న్లు అందుకున్న యామీ గౌత‌మ్ మ‌రోసారి స‌మ‌న్లు అందుకున్నారు. ఈ మేర‌కు ఆమె జూలై 7న కోర్టు ఎదుట హాజ‌రు కావాల్సి ఉంటుంది. ప‌లు బాలీవుడ్ చిత్రాల్లో న‌టించిన యామీ గౌత‌మ్ తెలుగులో నితిన్ స‌ర‌స‌న ‘కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్’ చిత్రంలో న‌టించింది. 

Bollywoodమరిన్ని...