ఆమ్‌వేకి ఈడీ భారీ షాక్.. రూ.757 కోట్లు సీజ్

ABN , First Publish Date - 2022-04-19T00:20:26+05:30 IST

న్యూఢిల్లీ : మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ భారీ షాకిచ్చింది.

ఆమ్‌వేకి ఈడీ భారీ షాక్.. రూ.757 కోట్లు సీజ్

న్యూఢిల్లీ : మల్టీలెవల్ మార్కెటింగ్ స్కాం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమ్‌వే ఇండియా ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేటు లిమిటెడ్‌కు దర్యాప్తు సంస్థ ఈడీ భారీ షాకిచ్చింది. సంస్థకు చెందిన రూ.757.77 కోట్లను తాత్కాలికంగా అటాచ్ చేసింది. సీజ్ చేసిన ఆస్తుల్లో ల్యాండ్‌తోపాటు తమిళనాడులోని దిండిగల్ జిల్లాలో కంపెనీకి చెందిన ఫ్యాక్టరీ భవనం ఉన్నాయి. కంపెనీ ప్లాంట్, మెషినరీలు, వాహనాలు, బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కూడా జాబితాలో ఉన్నాయని వివరించింది. సీజ్ చేసిన వాటిలో స్థిర, చరాస్థుల విలువ రూ.411.83 కోట్లు కాగా ఆమ్‌వేకి చెందిన 36 బ్యాంక్ ఖాతాలలోని రూ.345.94 కోట్ల నగదు కూడా ఉంది. మార్కెట్‌లో లభ్యమవుతున్న ఇతర ఉత్పత్తులతో పోల్చితే ఆమ్‌వే ఉత్పత్తులు చాలా ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. దీంతో జనాలు నష్టపోతున్నారని వివరించింది. కాగా మల్టీలెవల్ మార్కెటింగ్ నెట్‌వర్క్ ముసుగులో గొలుసుకట్టు మోసాలకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు రావడంతో ఆమ్‌వేపై మనీల్యాండరింగ్ చట్టాల కింద ఈడీ దర్యాప్తు జరుపుతోంది. 


కాగా కంపెనీ 2002-03 నుంచి 2021-22 మధ్యకాలంలో రూ.27,562 కోట్ల వ్యాపారం చేసిందని ఈడీ తెలిపింది. ఇదేకాలంలో భారత్, అమెరికాలోని కంపెనీ  డిస్టిబ్యూటర్లు, మెంబర్లకు కమీషన్ రూపంలో రూ.7,588 కోట్ల చెల్లింపులు చేసిందని పేర్కొంది. ఆమ్‌వే ఇప్పటివరకు భారత్‌లో రూ.21.39 కోట్ల విలువైన షేర్లు కొనుగోలు చేసిందని వెల్లడించింది. కాగా ఉమ్మడి రాష్ట్రాల్లో ఆమ్‌వేపై మొదటిసారి సీఐడీ విచారణ జరిగింది. తెలంగాణ పోలీసులు ఆమ్‌వే సీఈవోను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.



Updated Date - 2022-04-19T00:20:26+05:30 IST