Bengal ssc Scam: అమ్మ బాబోయ్.. వంద కోట్లు దాటేసిందిగా.. పెద్ద స్కామే ఇది..!

ABN , First Publish Date - 2022-09-20T05:08:25+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీకి తలనొప్పిగా మారిన బెంగాల్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును..

Bengal ssc Scam: అమ్మ బాబోయ్.. వంద కోట్లు దాటేసిందిగా.. పెద్ద స్కామే ఇది..!

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో అధికార టీఎంసీకి తలనొప్పిగా మారిన బెంగాల్ టీచర్స్ రిక్రూట్‌మెంట్ స్కామ్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో తాజాగా.. సోమవారం నాడు ఈడీ 40 స్థిరాస్తులను, రూ.48 కోట్ల రూపాయల లెక్కల్లో చూపని డబ్బుతో కూడిన 35 బ్యాంకు అకౌంట్లను అటాచ్ చేసింది. ఈ అటాచ్ చేసిన వాటిల్లో ఫ్లాట్లు, ఫార్మ్ హౌస్, కోల్‌కత్తాలో ప్రైమ్ ల్యాండ్, బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ అటాచ్ చేసిన ప్రాపర్టీస్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బెంగాల్ మాజీ మంత్రి పార్ధా ఛటర్జీ, అతని సన్నిహితురాలు అర్పిత ముఖర్జీకి చెందినవిగా ఈడీ తెలిపింది. డమ్మీ కంపెనీల పేర్లతో, వ్యక్తుల పేర్లతో ఈ ప్రాపర్టీస్ ఉన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. జులై 23న ఈ కుంభకోణం కేసులో పార్థా ఛటర్జీ, ఆయన అత్యంత సన్నిహితురాలు అర్పిత ముఖర్జీని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. జులై 22 నుంచి జులై 27-28 మధ్య చేసిన సోదాల్లో ఈ ఇద్దరికీ చెందిన రూ.49.80 కోట్ల డబ్బును, 5 కోట్లకు పైగా విలువ చేసే బంగారం, జువెలరీని పార్థా ఛటర్జీ, అర్పిత ముఖర్జీ నివాసాల్లో గుర్తించి ఈడీ సీజ్ చేసింది. తాజాగా.. చేసిన అటాచ్‌మెంట్‌తో కలిపి ఇప్పటివరకూ ఈ కేసులో రూ.103.10 కోట్లను ఈడీ సీజ్ చేసింది.



పార్థా ఛటర్జీని మంత్రి పదవి నుంచి సీఎం మమతా బెనర్జీ (mamata banerjee) ఇప్పటికే తప్పించిన సంగతి తెలిసిందే. టీఎంసీ పార్టీ నుంచి కూడా ఆయనను తొలగించారు. 2014-2021 వరకు పార్థా చటర్జీ విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన హయాంలోనే విద్యాశాఖలో ఈ కుంభకోణం వెలుగుచూసింది. ప్రాథమిక పాఠశాలల్లో టీచర్ పోస్టుల (Teacher Posts) కోసం ఆశావహులుగా ఉన్న 48 మంది అభ్యర్థుల జాబితా రోల్ నంబర్లతో సహా పార్థా ఛటర్జీ ఇంట్లో (Partha Chatterjee House) లభ్యమైనట్లు కోర్టుకు ఈడీ వెల్లడించింది. రిక్రూట్‌మెంట్ టెస్ట్ కోసం అడ్మిట్ కార్డులు, గ్రూప్-డీ (Group D) సిబ్బంది నియామకానికి సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆయన ఇంట్లో లభ్యమైనట్లు న్యాయస్థానానికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) తెలిపింది.

Updated Date - 2022-09-20T05:08:25+05:30 IST