బహుమతులను అందజేస్తున్న కోనేరు వంశీ
-కోనేరు చారిటబల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ
కాగజ్‌నగర్, జనవరి 16: క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందని కోనేరు చారిటబుల్ ట్రస్టు చైర్మన్ కోనేరు వంశీ అన్నారు. ఆదివారం ఎస్పీఎం క్రీడా మైదానంలో పట్టణానికి చెందిన వార్డుల లీగ్ మ్యాచ్ ను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లా డుతూ క్రీడలతో మానిసికోల్లాసంతో పాటు శరీర దారుడ్యత పెరుగుతుందన్నారు. క్రీడల్లో రాణించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో పట్టణానికి చెందిన వివిధవార్డుల క్రీడాకారులు పాల్గొ న్నారు. అనంతరం గెలుపొందిన జట్టుకు, అత్యంత ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు బహుమతులను అందజేశారు.