ఈ - క్రాప్‌ నమోదు తప్పనిసరి

ABN , First Publish Date - 2022-08-13T05:58:58+05:30 IST

ఖరీఫ్‌ 2022 ఈ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా తమ పంటలను ఈక్రాప్‌ చేయించుకోవాలని

ఈ - క్రాప్‌ నమోదు తప్పనిసరి
జి.కొండూరులో మాట్లాడుతున్న ఎంపీపీ లక్ష్మీతిరుపతమ్మ

 వ్యవసాయ సలహామండలి సమావేశంలో వ్యవసాయ అధికారులు

తిరువూరు, ఆగస్టు 12: ఖరీఫ్‌ 2022 ఈ క్రాప్‌ బుకింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని, రైతులు తప్పనిసరిగా తమ పంటలను ఈక్రాప్‌ చేయించుకోవాలని ఏవో పి.పద్మ సూచించారు. వ్యవసాయశాఖ కార్యాలయంలో శుక్రవారం వ్యవసాయ సలహామండలి సమావేశం నిర్వహించారు. ఏవో మాట్లాడుతూ, రైతులు పంటను అమ్ము కునేందుకు, ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ పంటరుణాలు పొందాలన్నా  ఈ- క్రాప్‌ నమోదు తప్పనిసరిగా చేసుకోవాలన్నారు.  రైతులు సెప్టెంబరు 5లోగా ఈకేవైసీ పూర్తిచేయించుకోవాలన్నారు. ఎంపీపీ గద్దల భారతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిబ్బంది పాల్గొన్నారు.

జి.కొండూరు: ప్రతి ఒక్క రైతు విధిగా ఈ-క్రాప్‌ నమోదు చేయించుకోవాలని ఎంపీపీ వేములకొండ లక్ష్మీ తిరుపతమ్మ సూచించారు. ఏవో కార్యాలయంలో శుక్రవారం జరిగిన మండలస్థాయి వ్యవసాయ సలహా మండలి సమావేశంలో మాట్లాడుతూ  రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులను వాడలన్నారు.  ఏవో ఎం.రామ్‌కుమార్‌, వ్యవసాయ సలహా మండలి మండల అధ్యక్షుడు జమ్ముల హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-13T05:58:58+05:30 IST