ఆర్థిక సర్వే 2022: ముఖ్యమైన 8 విషయాలు!

ABN , First Publish Date - 2022-02-01T00:08:54+05:30 IST

బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఆర్థిక సర్వే 2021-22ను పార్లమెంటులో

ఆర్థిక సర్వే 2022: ముఖ్యమైన 8 విషయాలు!

న్యూఢిల్లీ: బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు ఆర్థిక సర్వే 2021-22ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఆర్థిక వ్యవస్థలోని వివిధ రంగాలతోపాటు వృద్ధిని వేగవంతం చేయడానికి భవిష్యత్తులో అవసరమైన సంస్కరణలపై ఇది దృష్టి సారించింది. ఆర్థిక సర్వేలోని స్థూల ఆర్థిక స్థిరత్వ సూచికలు 2022-23 ఆర్థిక సంవత్సరం సవాళ్లను స్వీకరించడానికి దేశ ఆర్థిక వ్యవస్థ దృఢంగానే ఉందని సూచిస్తున్నాయి. ఆర్థిక సర్వేలోని ముఖ్యమైన 8 విషయాలివే..

 

బలమైన ఆదాయం

2022 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం బాగా పుంజుకుందని ఆర్థిక సర్వే పేర్కొంది. దీనిని బట్టి అవసరమైనప్పుడు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించింది. అలాగే, విదేశీ నిల్వలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐలు), ఎగుమతులు బాగా పెరిగినట్టు ఆర్థిక సర్వే పేర్కొంది.


జీడీపీ అంచనాలు

2020-23 ఆర్థిక సంవత్సరంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) 8 నుంచి 8.5 శాతం నమోవొచ్చని ఆర్థిక సర్వే అంచనా వేసింది. కాగా, జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్ఓ) అంచనా వేసిన 9.2శాతం వృద్ధిరేటుతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 7.3 శాతానికి తగ్గిందని కూడా పేర్కొంది. 

 

వ్యవసాయం

కరోనా మహమ్మారి కారణంగా వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు దెబ్బతిన్నాయి. మునుపటి సంవత్సరం (3.6 శాతం)తో పోలిస్తే ఈసారి ఈ రంగంలో వృద్ధి 3.9 శాతానికి పెరుగుతుందని అంచనా వేసింది.  


సేవల రంగం 

కరోనా మహమ్మారి సేవల రంగాన్ని దారుణంగా దెబ్బతీసింది. ఈ రంగంలో గత ఆర్థిక సంవత్సరం 8.4 శాతం వృద్ధి నమోదు కాగా, ఈసారి అది 8.2 శాతానికి తగ్గుతుందని అంచనా.

 

పారిశ్రామిక రంగం 

2022 ఆర్థిక సంవత్సరంలో పారిశ్రామిక రంగ వృద్ధి 11.2 శాతం నమోదవుతుందని ఆర్థిక సర్వే అంచనా వేసింది. 


వినియోగం

ప్రభుత్వ వ్యయ రూపంలో ప్రభుత్వ సహకారంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వినియోగం 7.0 శాతం పెరిగినట్టు అంచనా వేసింది. 


ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ

ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ అంశాన్ని కూడా ఆర్థిక సర్వే పేర్కొంది. పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ఆదాయాన్ని సేకరించడంలో ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ ఒక ముఖ్యమైన దశ అని ఆర్థిక సర్వే వివరించింది. 


మూలధన వ్యవ పెరుగుదల

ఆర్థిక సర్వే ప్రకారం.. డిమాండ్, సరఫరాను పెంచే చర్యల్లో భాగంగా ప్రభుత్వ మూలధన వ్యయంలో గణనీయమైన పెరుగుదల ఉండొచ్చు. 

Updated Date - 2022-02-01T00:08:54+05:30 IST