ఎకో టూర్‌.. వావ్‌!

ABN , First Publish Date - 2021-10-13T06:08:33+05:30 IST

ప్రకృతి రమణీయతకు మారుపేరు నల్లమల. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయారణ్యం. విశేషమైన వృక్ష సంప ద, లెక్కలేనన్ని వన్యప్రాణులు, ఎన్నోరకాల పక్షులు, పెద్దపులులు, చిరుతలు, ఔషధ మొక్క లు ఈ అడవి సొంతం.

ఎకో టూర్‌.. వావ్‌!
నల్లమల అడవి అందాలు చూస్తున్న విద్యార్థులు

ప్రకృతి రమణీయం.. నల్లమల సొంతం

తుమ్మలబైలు సమీపంలో  నేచర్‌ సఫారీ

పెరుగుతున్న పర్యాటకులు

పెద్దదోర్నాల, అక్టోబరు 12 : ప్రకృతి రమణీయతకు మారుపేరు నల్లమల. రాష్ట్రంలోనే అతిపెద్ద అభయారణ్యం. విశేషమైన వృక్ష సంప ద, లెక్కలేనన్ని వన్యప్రాణులు, ఎన్నోరకాల పక్షులు, పెద్దపులులు, చిరుతలు, ఔషధ మొక్క లు ఈ అడవి సొంతం. అయితే పర్యావరణ ప్రేమికులకు మరింత ఆసక్తిని కలిగించేందుకు అటవీ శాఖ ప్రత్యేక కార్యాచరణను రూపొందించింది. నల్లమల అందాలను దగ్గర నుంచి చూ సే అరుదైన అవకాశం ఎకో టూరిజం పేరిట అందుబాటులోకి తెచ్చింది. విద్యార్థులకు అయి తే ఇదో గొప్ప అనుభూతి. దసరా సెలవులు కా వడంతో ప్రస్తుతం ఎక్కువగా వారే వస్తున్నారు.


ఎకో టూరిజం ఏర్పాటు..

ఎకో టూరిజంలో భాగంగా మండలంలోని తుమ్మలబైలు గిరిజన గ్రామ సమీపంలో శ్రీశైలం-దోర్నాల ఘాట్‌ రోడ్డుపై నేచర్‌ సఫారీ ఏర్పాట్లలో భాగంగా ముఖద్వారం ఏర్పాటుచేశారు. ఇక్కడే పర్యాటకులు సందర్శన నిమిత్తం టిక్కెట్టు పొందేందుకు ప్రత్యేక కౌంటరు, సిబ్బంది విశ్రాంతి కోసం గది, నల్లమలపై అవగాహన కల్పించేందుకు మరోగదిని నిర్మించారు. ఈ గదిలో చిన్నపాటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖద్వారం, పలు కట్టడాలు సహజత్వం ఉట్టిపడేలా వెదురు కలపతో నిర్మించారు. కొంతకాలం నల్లమలలో పర్యటన కోసం ఏర్పాటుచేసిన ఎకో టూరిజం సందర్శనను కరోనా కారణంగా నిలిపివేశారు. తిరిగి ఈనెల 1 నుంచి  పునఃప్రారంభించారు.


ప్రయాణమిలా సాగుతుంది..

దోర్నాల నుంచి శ్రీశైలం వెళ్లే ఘాట్‌ రోడ్డుపై 24 కిలోమీటర్ల దూరంలో నేచర్‌ సఫారీ ముఖద్వారం ప్రారంభమవుతుంది. పక్కనే నిర్మించిన కౌంటర్‌ గది వద్ద టిక్కెట్లు పొందిన వారిని రెండు ఓపెన్‌ టాప్‌ జిప్సీల్లో అటవీ శాఖాధికారులు లోపలికి తీసుకువెళ్తారు. అభయారణ్యం గుండా పెద్దచెరువు, నరమామిడి చెరువు, ఎదురుపడియ, బేస్‌ క్యాం పు, తదితర ప్రాంతాల మీదుగా 30 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగుతుం ది. అందుకు రెండుగంటల సమయం పడుతుంది. పెద్దచెరువు వద్ద రీసెర్చ్‌ సెంట ర్‌ గెస్ట్‌హౌస్‌లు ఉన్నాయి. ఈ ప్రయాణం పర్యాటకులకు ఎంతో అనుభూతినిస్తుంది. 


రోళ్లపెంట వద్ద విజ్ఞాన కేంద్రం 

పర్యాటకుల సౌకర్యార్థం నల్లమల అభయారణ్యంలో కర్నూలు-గుంటూరు జాతీయ రహదారిలోని రోళ్లపెంట వద్ద అటవీ శాఖాధికారులు పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుచేశారు. అక్కడ నల్లమలలోని వృక్ష, ఔషధ మొక్కలు, జంతు, జీవరాశుల పూర్తి సమాచారాన్ని తెలియజేసే చిత్రపటాలు, వివరాలు ప్రదర్శనగా ఉంచారు. దసరా సెలవుల్లో విద్యార్థులు, ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని పదికాలాల పాటు స్మృతులుగా నిలుపుకోవాలని ఆ శాఖాధికారులు కోరుతున్నారు.

Updated Date - 2021-10-13T06:08:33+05:30 IST