ప్రముఖ బ్రాండ్ ఇకో ఫ్రెండ్లీ జీన్స్ ధర రూ.88000 పైనే!!

ABN , First Publish Date - 2020-09-22T21:45:00+05:30 IST

లగ్జరీ, డిజైనర్ బ్రాండ్లు సృజనాత్మకతకు ఏదో ఓ స్టైల్‌ను జోడించి వాటిని మితిమీరిన ధరలకు విక్రయిస్తుంటారు. ఈ కోవలోకే ప్రస్తుతం ఇకో ఫ్రెండ్లీ జీన్స్ అంటూ స్టైల్‌కు పెట్టింది పేరు ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ గుచ్చీ తీసుకువచ్చింది...

ప్రముఖ బ్రాండ్ ఇకో ఫ్రెండ్లీ జీన్స్ ధర రూ.88000 పైనే!!

లగ్జరీ, డిజైనర్ బ్రాండ్లు సృజనాత్మకతకు ఏదో ఓ స్టైల్‌ను జోడించి వాటిని మితిమీరిన ధరలకు విక్రయిస్తుంటారు. ఈ కోవలోకే ప్రస్తుతం ఇకో ఫ్రెండ్లీ జీన్స్ అంటూ స్టైల్‌కు పెట్టింది పేరు ప్రముఖ ఇటాలియన్ బ్రాండ్ గుచ్చీ తీసుకువచ్చింది. సాధారణంగా కనిపించే జీన్స్ ప్యాంటుకు కాస్త పచ్చ గడ్డి మరకల డిజైన్ వేసి వాటిని ప్యూర్ ఆర్గానిక్ డెనిమ్ జీన్స్ పేరుతో విక్రయిస్తోంది. ఈ జీన్స్ ప్యాంటు పూర్తిగా ఆర్గానిక్ కాటన్ తయారు చేయబడింది అని గుచ్చి సంస్థ ప్రచారం చేస్తోంది. ఈ జీన్స్ గుచ్చి ఫాల్ వింటర్ కలెక్షన్‌లో లభిస్తోంది. వీటి ధర అక్షరాలా రూ.88000 నుంచి రూ.120000!!

Updated Date - 2020-09-22T21:45:00+05:30 IST