కరోనా వల్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 168 కోట్లు నష్టం!

ABN , First Publish Date - 2021-05-13T12:54:37+05:30 IST

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. గడిచిన ఏడాది నుంచి ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది.

కరోనా వల్ల ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు 168 కోట్లు నష్టం!

లండన్: కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. గడిచిన ఏడాది నుంచి ఈ మహమ్మారి ప్రపంచాన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ఈ క్రమంలో కరోనా వల్ల ఏడాది కాలంలో తమ బోర్డుకు 16.1 మిలియన్ యూరోలు అంటే భారత లెక్కల ప్రకారం సుమారు రూ.168కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) వెల్లడించింది. గతేడాది కరోనా కారణంగా తాము ఆర్థికంగా చాలా నష్టపోయామని చెప్పిన బోర్డు.. ప్యాండెమిక్ కారణంగా చాలా టోర్నీలు వాయిదా వేయాల్సి వచ్చిందని తెలిపింది. ది హండ్రెడ్ టోర్నీని వాయిదా వేయడం, అలాగే ఆడే టోర్నీలను బయో సెక్యూర్ చేయడం కోసం కూడా బాగా ఖర్చయిందని ఈసీబీ వెల్లడించింది. దీని వల్ల తమ బోర్డు ఆదాయం 21 మిలియన్ యూరోలు తగ్గి 207 మిలియన్ యూరోలకు చేరిందని పేర్కొంది.

Updated Date - 2021-05-13T12:54:37+05:30 IST