ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈసీ లేఖ

ABN , First Publish Date - 2022-01-03T21:19:10+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు భారత ఎన్నికల

ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు ఈసీ లేఖ

న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన ఐదు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు భారత ఎన్నికల కమిషన్ సోమవారంనాడు లేఖ రాసింది. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను వేగవంతం చేయాలని కోరింది. మణిపూర్‌లో వ్యాక్సినేషన్ తొలి డోసు తీసుకున్న వారి శాతం చాలా తక్కువగా ఉండటం పట్ల ఎన్నికల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.


ఎన్నికల కమిషన్ టీమ్‌లు ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించి ఎన్నికల సంసిద్ధతను స్వయంగా సమీక్షించడం ప్రారంభించింది. ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల మూడు రోజుల పాటు ఈసీ పర్యటించింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రధాన పార్టీల ప్రతినిధుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. అధికారులతో సమీక్షలు జరిపింది. పంజాబ్, గోవా, మణిపూర్‌, ఉత్తరాఖండ్‌లోనూ పర్యటించేందుకు ఈసీ టీమ్‌లు సిద్ధమవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి, మార్చిలోగా ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీల కాలపరమితి ముగియనుండటంతో దీనికి ముందే కోవిడ్ నిబంధనలు అమలు చేస్తూనే ఎన్నికలు నిర్వహించాలని కొన్ని పార్టీలు అభిప్రాయపడుతుండగా, పెరుగుతున్న కోవిడ్ కేసులను దృష్టిలో ఉంచుకుని ఎన్నికలు వాయిదా వేయాలని మరికొన్ని పార్టీలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని ఇటీవల కేంద్రానికి సూచించిన ఎన్నికల కమిషన్ తాజాగా ఇదే విషయమై సత్వర చర్యలు తీసుకోవాలని ఐదు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలను తాజా లేఖలో ఈసీ కోరింది.

Updated Date - 2022-01-03T21:19:10+05:30 IST