బెంగాల్ పోలీసు అధికారులను బదిలీ చేసిన ఈసీ

ABN , First Publish Date - 2022-04-08T23:18:39+05:30 IST

ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని ..

బెంగాల్ పోలీసు అధికారులను బదిలీ చేసిన ఈసీ

న్యూఢిల్లీ: ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమబెంగాల్‌లోని అసోంసోల్‌ లోక్‌సభకు మరో నాలుగు రోజుల్లో ఉప ఎన్నిక జరుగనున్న తరుణంలో ఇద్దరు పోలీసు అధికారుల బదిలీకి ఈసీ ఆదేశించింది. వీరిరువురు అసోంసోల్ దుర్గాపూల్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన అధికారులు. సౌత్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఇన్‌చార్జి అభిజిత్ ఛటర్జీ, జమురియా పోలీస్ స్టేషన్ అధికారికి సంజీవ్ డె‌పై ఈ బదిలీ వేటు పడింది. వారి స్థానంలో ముగ్గురి పేర్లను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఈసీ ఆదేశించింది.


అసోంసోల్ లోక్‌సభ మాజీ ఎంపీ బాబుల్ సుప్రియో బీజేపీని వీడటంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. ఉపఎన్నికలో టీఎంసీ అభ్యర్థిగా బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్నుసిన్హా పోటీ చేస్తుండగా, ఆయనపై పోటీకి అసోంసోల్ బీజేపీ ఎమ్మెల్యే‌ అగ్నిమిత్ర పాల్‌ను ఆ పార్టీ నిలబెట్టింది.

Updated Date - 2022-04-08T23:18:39+05:30 IST