బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ యథాతథం : ఈసీ స్పష్టత

ABN , First Publish Date - 2021-04-22T01:31:09+05:30 IST

బెంగాల్ పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టతనిచ్చింది. మిగిలిన మూడు దశల ఎన్నికల పోలింగ్‌ యథాతథంగానే

బెంగాల్ ఎన్నికల షెడ్యూల్ యథాతథం : ఈసీ స్పష్టత

కోల్‌కతా : బెంగాల్ పోలింగ్‌పై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి స్పష్టతనిచ్చింది. మిగిలిన మూడు దశల ఎన్నికల పోలింగ్‌ యథాతథంగానే కొనసాగుతుందని బుధవారం మరోసారి స్పష్టం చేసింది. మిగిలిన మూడు దశలను కలిపి ఒకేసారి నిర్వహించాలని అధికార తృణమూల్ కాంగ్రెస్ ఈసీకి మరోసారి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పై విధంగా స్పందించింది. మూడు దశల పోలింగ్ యథాతథంగా, షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, అందులో ఎలాంటి మార్పూ ఉండదని స్పష్టం చేసింది. అలాగే తృణమూల్ పంపిన ప్రతిపాదనను తోసిపుచ్చింది. రాష్ట్రంలో కోవిడ్ విజృంభిస్తోందని, దీనిని దృష్టిలో పెట్టుకొని మిగిలిన మూడు దశల పోలింగ్‌ను కలిపి ఒకేసారి (ఒకేరోజు) నిర్వహించాలని తృణమూల్ ఈసీని కోరింది. 

Updated Date - 2021-04-22T01:31:09+05:30 IST