బెంగా‌ల్‌లో నాలుగు విడతల పోలింగ్ ఒకేరోజు నిర్వహించే అవకాశం..!

ABN , First Publish Date - 2021-04-15T01:59:36+05:30 IST

పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతలు ముగిసి, మరో నాలుగు విడతలు..

బెంగా‌ల్‌లో నాలుగు విడతల పోలింగ్ ఒకేరోజు నిర్వహించే అవకాశం..!

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నాలుగు విడతలు ముగిసి, మరో నాలుగు విడతలు పూర్తి కావాల్సి ఉన్న నేపథ్యంలో కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండటంతో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిస్థితిని సమీక్షించి, ఎన్నికల ప్రచార నిర్వహణపై పార్టీల అభిప్రాయం తెలుసుకునేందుకు ఎన్నికల కమిషన్ వచ్చే శుక్రవారంనాడు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. ఈ నెలలోనే పూర్తి చేయాల్సిన నాలుగు విడతల (5,6,7,8) పోలింగ్‌ను ఏకం చేసి ఒకేసారి (రోజు) నిర్వహించే అవకాశాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.


కాగా, పశ్చిమబెంగాల్‌లో గత 24 గంటల్లో కొత్తగా 4,817 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు చోటుచేసుకున్నాయి. కోల్‌కతాలో ఒక్కరోజే 1,271 కేసులు, నార్త్ 24 పరగణాల్లో 1,134 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రలో ప్రస్తుత 29,050 యాక్టివ్ కేసులున్నాయి. కోల్‌కతా నుంచి తాజాగా 11 మరణాలు, నార్త్ 24 పరగణాల నుంచి 4, హుగ్లీ, హౌరా నుంచి చెరో రెండు, పశ్చిమ బర్దమాన్ జిల్లాలో ఒక కేసు నమోదయ్యాయి. మంగళవారం వరకూ 1,13,710 మంది కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. మరోవైపు, కరోనా కేసులు విజృంభిస్తుండటంతో వ్యాకినేషన్ వేసేందుకు ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2021-04-15T01:59:36+05:30 IST