కాంగోలో ఎబోలా వ్యాప్తి..డబ్ల్యూహెచ్ఓ వెల్లడి

ABN , First Publish Date - 2020-07-14T13:17:33+05:30 IST

కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది....

కాంగోలో ఎబోలా వ్యాప్తి..డబ్ల్యూహెచ్ఓ వెల్లడి

జెనీవా : కాంగో దేశంలో ఎబోలా వైరస్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కాంగో, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ సరిహద్దుల్లో 48 ఎబోలా కేసులు వెలుగుచూశాయని డబ్ల్యూహెచ్ఓ అత్యవసర నిపుణుడు మైక్ ర్యాన్ చెప్పారు. జూన్ 1వతేదీనుంచి వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ వల్ల 20 మంది మరణించారని మైక్ ర్యాన్ చెప్పారు. ఎబోలా చురుగ్గా వ్యాప్తి చెందుతుందని మైక్ ర్యాన్ వివరించారు. కాంగో నదీ తీర ప్రాంతాల్లో కరోనాకు తోడు ఎబోలా వైరస్ ప్రబలుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది. ఎబోలా వల్ల గత రెండేళ్లలో 2,277 మంది మరణించిన నేపథ్యంలో డబ్ల్యూహెచ్ఓ దీని నివారణకు చర్యలు తీసుకోవాలని కోరింది. 

Updated Date - 2020-07-14T13:17:33+05:30 IST