Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొవిడ్‌ భోజన నియమాలు ఇవే!

ఆంధ్రజ్యోతి(18-05-2021)

కొవిడ్‌ - 19 నుంచి కోలుకునేవారికి ప్రభుత్వం కొన్ని ఆహార నియమాలను సూచిస్తోంది. ఈ భోజన నియమాలతో నిస్సత్తువ, నీరసం వదిలి, కోలుకునే వేగం పెరుగుతుంది. ఐదంచెల ఆ మీల్‌ ప్లాన్‌ ఏంటంటే...


నిద్ర లేచిన వెంటనే: నీళ్లలో నానబెట్టిన బాదం, ఎండు ద్రాక్ష తినాలి. బాదంలో మాంసకృత్తులు, ఎండుద్రాక్షలో ఐరన్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి కొవిడ్‌ తాలూకు నీరసాన్ని వదిలిస్తాయి.


అల్పాహారం: రాగి దోశ లేదా పోరిడ్జ్‌ ఉత్తమమైన అల్పాహారం.


మధ్యాహ్న భోజనంతో లేదా భోజనం తర్వాత తీసుకునే పదార్థాలతో పాటు నెయ్యి, బెల్లం తినాలి. వీటిని రోటీతో కలిపి కూడా తినవచ్చు.

రాత్రి భోజనంలో కిచిడి తింటే అవసరమైన పోషకాలన్నీ అందుతాయి. తేలికగా అరగడంతో పాటు మంచి నిద్ర పడుతుంది.

ఎక్కువగా నీళ్లు తాగాలి. నీళ్లతో పాటు నిమ్మరసం, మజ్జిగా తాగాలి.


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...