Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊరగాయలు తింటే ఆరోగ్యానికి మంచిదే.. కానీ..

ప్రశ్న: ఊరగాయలు తింటే మంచిదా? చెడ్డదా?

- రంజని, నెల్లూరు


సమాధానం: కొన్ని రకాల కాయలు ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి ఊరగాయలు, ఆవకాయలు పెడతారు. ఊరగాయల్లో ఉప్పు, నూనె, కారంతో పాటు అల్లం, వెల్లుల్లి, ఆవపిండి, మెంతిపిండి వంటివి కూడా కలుపుతారు. సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషకవిలువలలో మొత్తం కాకపోయినా కొంతైనా ఊరగాయల్లో కూడా ఉంటాయి. కొద్ది మోతాదులో ఊరగాయలు తీసుకుంటే వాటిలోని యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు మనకందటమే కాక జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా ఉపయోగపడతాయి. కొన్ని రకాల ఊరగాయల్లో మంచి బాక్టీరియా ఉండడం వల్ల ప్రోబయాటిక్స్‌గా పనిచేస్తాయి. కానీ, అధిక మొత్తంలో ఉప్పు, కారం ఉన్నందున ఊరగాయల్ని ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి. కాబట్టి అవసరానికి మించి అన్నం తింటాం. అంతే కాకుండా ఊరగాయ ఎక్కువగా తినేవారు మాములు కాయగూరలు, ఆకుకూరలు తగ్గిస్తారు. దీనివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది. అధిక రక్తపోటు ఉన్నవారు ఊరగాయలకు దూరంగా ఉండడం ఉత్తమం. వీటిలో ఎక్కువగా ఉండే నూనె ద్వారా కూడా అవసరమైన దానికంటే అధికంగా కెలోరీలు శరీరానికి అంది బరువు పెరగవచ్చు. ఈ ఊరగాయలు అన్నంతో తినడం కాకుండా కూరలతోనో, పప్పుతోనో, పెరుగులోనో నంజుకుని తింటే, అన్నం అధికంగా తీసుకొనే పని తప్పుతుంది. 


డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com

(పాఠకులు తమ సందేహాలను [email protected]కు పంపవచ్చు)

Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement