Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉల్లిని పచ్చిగా తింటే..

ఆంధ్రజ్యోతి(03-10-2020)

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని సామెత. అది నిజమేనని చెబుతోంది వైద్య శాస్త్రం కూడా. ఉల్లిపాయని పచ్చిగా తిన్నా, వండుకుని తిన్నా.. ఎలా తిన్నా ఆరోగ్యమేనట. కరోనా కాలంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం. కాబట్టి రోజూ ఉల్లిపాయలు తినడం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఉల్లిని పచ్చిగా తింటే  ఔషధ గుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి. ఉల్లిలో సల్ఫర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కాలేయం సక్రమంగా పనిచేయాలంటే రాత్రి భోజనం తరువాత వెనిగర్‌లో ఉల్లిపాయ ముక్కలు, చిటికెడు ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తినాలి. కాలేయం ఎలాంటి సమస్యల బారిన పడకుండా చక్కగా పనిచేస్తుంది. కడుపులో నులిపురుగుల సమస్య పెద్దల నుంచి పిల్లల వరకు వేధిస్తుంది. అలాంటివారు గోరు వెచ్చటి నీటిలో ఒక స్పూనుడు ఉల్లిరసం వేసుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...