క్యారెట్లను ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందంటే..?

ABN , First Publish Date - 2022-03-01T16:36:50+05:30 IST

రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు రాత్రి వేళ జర్మనీ యుద్ధ విమానాలను కనిపెట్టి, నేలకూల్చడం కోసం ఒక రాడార్‌ టెక్నాలజీని కనుగొన్నారు

క్యారెట్లను ఎక్కువగా తినడం వల్ల ఏం జరుగుతుందంటే..?

ఆంధ్రజ్యోతి(01-03-2022)

అపోహ: క్యారెట్లు తింటే కంటి చూపు పెరుగుతుంది.


వాస్తవం: రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిషర్లు రాత్రి వేళ జర్మనీ యుద్ధ విమానాలను కనిపెట్టి, నేలకూల్చడం కోసం ఒక రాడార్‌ టెక్నాలజీని కనుగొన్నారు. అయితే ఆ రహస్యాన్ని దాచి ఉంచడం కోసం క్యారెట్లు ఎక్కువగా తినడం వల్లే తమ పైలెట్లు, చీకట్లో సైతం జర్మనీ విమానాలను స్పష్టంగా కనిపెట్టి, కూల్చేయగలిగారనే తప్పుడు ప్రచారాన్ని బ్రిటన్‌ వెలుగులోకి తీసుకు రావడం జరిగింది. కాలక్రమేణా అదే అపోహ విస్కృతంగా ప్రచారంలోకొచ్చింది. అయితే నిజానికి క్యారెట్లలో ఉండే నారింజ రంగు బీటాకెరోటిన్‌ను మన శరీరం విటమిన్‌ ఎగా మార్చుకుంటుంది. కాబట్టి విటమిన్‌ ఎతో కంటిచూపుకు మేలు జరిగే మాట వాస్తవమే అయినా, అవసరానికి మించి క్యారెట్లను తినడం వల్ల అదనంగా కంటి చూపు మెరుగుపడదు. 

Updated Date - 2022-03-01T16:36:50+05:30 IST