కుకీని తినగలరా?

ABN , First Publish Date - 2020-05-19T05:30:00+05:30 IST

ఇంట్లోనే ఇద్దరు, ముగ్గురు కలిసి ఎంజాయ్‌ చేస్తూ ఆడుకునే ఆట ఇది. ఇంకెందుకాలస్యం ట్రై చేయండి...

కుకీని తినగలరా?

ఇంట్లోనే ఇద్దరు, ముగ్గురు కలిసి ఎంజాయ్‌ చేస్తూ ఆడుకునే  ఆట ఇది. ఇంకెందుకాలస్యం  ట్రై చేయండి.


కావలసినవి:

  1. ఓరియో కుకీస్‌


ఎలా ఆడాలంటే...

  1. ఆట ఆడుతున్న వ్యక్తి నుదుటి భాగంపై ఓరియో బిస్కెట్‌ను పెట్టాలి. 
  2. చేత్తో ముట్టుకోకుండా, బిస్కెట్‌ కిందపడకుండా తినాలి.
  3. నెమ్మదిగా ముఖ కండరాలను కదిలిస్తూ, బిస్కెట్‌ను నోటి దగ్గరకు తీసుకురావాల్సి ఉంటుంది.
  4. కిందపడకుండా, ముట్టుకోకుండా తిన్న వ్యక్తి గెలిచినట్టు లెక్క!
  5. ఇది సింపుల్‌ గేమ్‌లా అనిపిస్తున్నా, పూర్తి చేయడం అంత ఈజీ కాదు.

Updated Date - 2020-05-19T05:30:00+05:30 IST