Advertisement
Advertisement
Abn logo
Advertisement

సన్నగా ఉన్నవాళ్లు లావు కావాలంటే..

ఆంధ్రజ్యోతి(19-05-2020):

ప్రశ్న: మేము ముగ్గురు అక్కచెల్లెళ్ళం. బాగా సన్నగా ఉంటాం. కాస్త లావు కావడానికి, శరీర సౌష్టవం, ముఖవర్చస్సు మెరుగవడానికి ఏం చెయ్యాలి?


- వసుంధర, హైదరాబాద్‌ 


డాక్టర్ సమాధానం: కొంతమందికి జన్యుపరమైన కారణాల వల్ల కూడా బరువు పెరగడం కష్టం అవుతుంది. థైరాయిడ్‌ సమస్య ఉన్నా, బరువు తక్కువగా ఉంటారు. తీసుకునే ఆహారం సరిగా వంటబట్టకపోయినా బరువు పెరగడం కష్టం. ఒకేసారి ఆహారం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటే.. తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తీసుకుంటే కొంత ఉపయోగకరం. అన్నం, గోధుమలే కాకుండా అనేక పప్పు ధాన్యాలు, సోయా, సెనగలు, బఠాణి లాంటి గింజలు బాగా తీసుకోవాలి. వెన్న తీయని పాలు, మీగడ తీయని పెరుగు కూడా రోజుకు కనీసం ముప్పావు లీటరు వరకు తీసుకోండి. రోజూ రెండు గుడ్లు, వారానికి రెండు లేదా మూడుసార్లు చికెన్‌ లేదా చేప తీసుకుంటే మంచిది. రెండు లేదా మూడు గంటలకు ఓసారి ఆహారం తీసుకోవాలి. తాజా పళ్ళు తప్పని సరి. రోజుకు పిడికెడు బాదం, పిస్తా, ఆక్రోట్‌, వేరుశెనగ గింజలు తినాలి. తగినన్ని నీళ్లు తాగాలి. టీ, కాఫీలను మానెయ్యాలి. రోజూ కనీసం ముప్ఫయి నిమిషాలపాటు తేలికపాటి వ్యాయామం చేస్తే ఆకలి పెరగడంతో పాటు తీసుకున్నది వంటబట్టి బరువు పెరుగుతారు. శరీర సౌష్టవానికి ముఖ్యంగా సోయా ఉత్పత్తులు, నువ్వులు, అవిసె గింజలు తీసుకుంటే మంచిది. ముఖవర్చస్సు కోసం తాజా పండ్లు తినడం, రెండు లీటర్ల నీళ్లు తాగడం అవసరం.

 

డా. లహరి సూరపనేని

న్యూట్రిషనిస్ట్‌, వెల్‌నెస్‌ కన్సల్టెంట్‌

nutrifulyou.com(పాఠకులు తమ సందేహాలను

[email protected]కు పంపవచ్చు)


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement