Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇవి తిని చూడండి!

ఆంధ్రజ్యోతి(17-03-2021)

రోజూ వాల్‌నట్స్‌ తింటే చర్మం మృదువుగా అవుతుంది.


ఎండు ఖర్జూరాలు నీటిలో నానబెట్టుకుని రోజూ నాలుగు తింటే రక్తహీనత సమస్య తగ్గుతుంది. కరివేపాకు కూడా రక్తహీనతను తగ్గిస్తుంది.


రోజూ కప్పు ఉడకబెట్టిన శెనగలు తింటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది.


కలబంద గుజ్జులో కొద్దిగా గులాబీ నీరు కలిపి ఆ పేస్టును ముఖానికి రాసుకుంటే నిగారింపు వస్తుంది.


అవకడోలు తింటే మలబద్దకం సమస్య పోతుంది.


కామెర్ల సమస్యతో బాధపడే వారు దానిమ్మ రసం తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 


ఆవాలను ఎక్కువ తింటే శరీరంలో ఇన్సులిన్‌ పెరుగుతుంది.


అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది.


జామపండ్లు హార్మోన్ల హెచ్చుతగ్గులను నివారిస్తాయి.


అత్తిపండ్లు తింటే శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి.


పిస్తా జ్ఞాపకశక్తి పెరగడానికి తోడ్పడుతుంది.

Advertisement
Advertisement