జీలకర్రతో జీర్ణం తేలిక

ABN , First Publish Date - 2020-09-23T05:30:00+05:30 IST

జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు జీలకర్రలో బోలెడు. కడుపు ఉబ్బరంగా అనిపించినా, అజీర్తి చేసినా జీరా నీళ్లు తాగితే సత్వరమే ఉపశమనం లభిస్తుంది.

జీలకర్రతో జీర్ణం తేలిక

జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచే పోషకాలు జీలకర్రలో బోలెడు. కడుపు ఉబ్బరంగా అనిపించినా, అజీర్తి చేసినా జీరా నీళ్లు తాగితే సత్వరమే ఉపశమనం లభిస్తుంది. కొద్దిగా బ్లాక్‌సాల్ట్‌, నిమ్మరసం, క్లబ్‌సోడా కలిపిన జీరా నీళ్లు జీర్ణసమస్యలను తగ్గించడంతో పాటు చల్లదనాన్ని ఇస్తాయి. 


కావలసినవి

రెండు గ్లాసుల నీళ్లు, రెండు లేదా మూడు టేబుల్‌ స్పూన్ల జీలకర్ర, మూడు పుదీనా ఆకులు, నిమ్మరసం, బ్లాక్‌సాల్ట్‌ తగినంత, చక్కెర లేదా తేనె రుచికి సరిపడా, సగం టీస్పూన్‌ కన్నా తక్కువ కారం పొడి, క్లబ్‌ సోడా. 


తయారీ విధానం

 ముందుగా పుదీనా ఆకులను చిన్న రోటిలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. జీలకర్రను పెనం మీద వాసన వచ్చేంత వరకూ వేగించాలి. తరువాత నీళ్లు పోసి సన్నని మంటమీద 5-10 నిమిషాలు మరగనివ్వాలి. మిక్సీలో ఈ వాటర్‌ వేసి పూర్తిగా కలిసేలా బ్లెండ్‌ చేయాలి. ఇప్పుడు పొడవాటి గ్లాసు తీసుకొని అందులో పావుభాగం జీరా నీళ్లు పోయాలి. పుదీనా ఆకుల పేస్ట్‌, బ్లాక్‌ సాల్ట్‌, నిమ్మరసం, కారం పొడి, తేనె లేదా పంచదార వేసి బాగా కలపాలి. తరువాత క్లబ్‌ సోడాతో గ్లాసు నింపాలి. కొద్దిగా ఐస్‌ వేయాలి. 

Updated Date - 2020-09-23T05:30:00+05:30 IST