భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : ప్రవాస తూర్పు టర్కిస్థాన్ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-08-16T03:04:49+05:30 IST

భారత దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రవాస తూర్పు టర్కిస్థాన్ ప్రభుత్వం

భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు : ప్రవాస తూర్పు టర్కిస్థాన్ ప్రభుత్వం

వాషింగ్టన్ : భారత దేశ 74వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా ప్రవాస తూర్పు టర్కిస్థాన్ ప్రభుత్వం శుభాకాంక్షలు తెలిపింది. భారతీయులు స్వాతంత్ర్యాన్ని గౌరవిస్తూ, ఆనందించాలని ఆకాంక్షించింది. 


ప్రవాస తూర్పు టర్కిస్థాన్ ప్రధాన మంత్రి సలీహ్ హుడయార్ భారతీయులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు టర్కిస్థాన్‌లో చైనా ఆక్రమణ, జనహననం దశాబ్దాలుగా సాగుతోందని, స్వాతంత్ర్యం లేకపోతే అత్యంత ప్రాథమిక మానవ హక్కులకు సైతం భరోసా ఉండదని అర్థమైందని చెప్పారు. 


స్వాతంత్ర్యం ఎందుకు అంత ముఖ్యమైనదని కొందరు అడగవచ్చునని, స్వాతంత్ర్యం అంటే ఇతరుల అణచివేత, ప్రభావం, నియంత్రణ నుంచి స్వేచ్ఛ అని తెలిపారు. స్వతంత్ర దేశం తన చట్టాలను తానే చేసుకోగలుగుతుందని, ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. పరిపాలనకు, నిర్ణయాలు తీసుకోవడానికి స్వేచ్ఛ ఉంటుందని తెలిపారు. 


Updated Date - 2020-08-16T03:04:49+05:30 IST