ప్రధాన పాత్ర పోషిస్తున్న వలంటీర్లు

ABN , First Publish Date - 2021-04-17T05:43:47+05:30 IST

కొత్తపల్లి, ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను అమలు చేయడంలో గ్రామ వలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి వీవీఎస్‌ కన్వెక్షన్‌హాలులో శుక్రవారం పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు చెందిన వలంటీర్లకు

ప్రధాన పాత్ర పోషిస్తున్న వలంటీర్లు
కొత్తపల్లిలో వలంటీర్‌ను సత్కరిస్తున్న కలెక్టర్‌, ప్రజాప్రతినిధులు

కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి 

కొత్తపల్లి, ఏప్రిల్‌ 16: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాలను అమలు చేయడంలో గ్రామ వలంటీర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి అన్నారు. కొత్తపల్లి వీవీఎస్‌ కన్వెక్షన్‌హాలులో శుక్రవారం పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు చెందిన వలంటీర్లకు ఉగాది పురస్కారాల ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. గ్రామంలో ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలను వివరించి, వాటి అమలులో వలంటీర్లు సఫలీకృతులయ్యారన్నారు. దీంతో వారి సేవలను గుర్తించి ఇక నుంచి ప్రతీ ఏడాది వలంటీర్లకు ప్రోత్సాహక బహుమతులను అందించేందుకు సీఎం జగన్‌ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్రలను పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆధ్వర్యంలో కలెక్టర్‌, కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాధ్‌, ఎస్పీ నయీం అస్మీ దుశ్శాలువాలతో ఘ నంగా సత్కరించి ప్రసంసాపత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ హరిహరనాధ్‌, కొత్తపల్లి ఎంపీడీవో పివసంతమాధవి, పిఠాపురం, గొల్లప్రోలు మండలాలకు చెందిన అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


వలంటీర్ల ఆవేదన 

కొత్తపల్లి మండలంలో 74 మంది వలంటీర్లు పురస్కాలకు ఎంపిక కాకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతీరోజూ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ పథకాలను అమలు చేసినా తమను ఎంపిక చేయలేదని ఆందోళన చెందారు. ప్రజలకు ఎటువంటి ప్రభుత్వ పథకాలను వివరించనివారు పురస్కారాలు పొందారని, తమ సేవలను అధికారులు గుర్తించలేదని పలువురు తీవ్ర మనస్థాపం చెందారు. ఈ విషయమై ఎంపీడీవో పి.వసంతమాధవి మాట్లాడుతూ మండలంలో 74 మంది వలంటీర్లు పురస్కారాలకు ఎంపిక కాలేదని, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - 2021-04-17T05:43:47+05:30 IST