పెద్దాపురంలో రెండోరోజు జోరుగా కోడిపందాలు, గుండాట

ABN , First Publish Date - 2021-01-14T17:56:28+05:30 IST

తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో రెండవ రోజు కోడిపందాలు, గుండాటా జోరుగా సాగుతున్నాయి.

పెద్దాపురంలో రెండోరోజు జోరుగా కోడిపందాలు, గుండాట

రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా  పెద్దాపురం నియోజకవర్గంలో రెండవ రోజు కోడిపందాలు, గుండాటా జోరుగా సాగుతున్నాయి.  పెద్దాపురం మండలం ఆర్ బి కొత్తూరు, గుడివాడ, కాండ్రకోట, పులిమేరు, దివిలి....సామర్లకోట మండలం వేట్లపాలెం, జి.మేడపాడు, ఉండూరు, అచ్చంపేట, వీకే రాయపురం మాధవపట్నం గ్రామాల్లో జోరుగా పందాలు జరుగుతున్నాయి. అటు ముమ్మిడివరం నియోజకవర్గ పరిధిలోని కేశనకుర్రుపాలెం, మురమళ్ల, గుత్తెనదీవి, రాజుపాలెం, పల్లిపాలెం, అన్నంపల్లి, ఠాణేలంక, చేయ్యారు, గెద్దనాపల్లి, కొత్త లంక, పాత యింజరం గ్రామాల్లో కోడిపందాలు జోరుగా సాగుతున్నాయి. 

Updated Date - 2021-01-14T17:56:28+05:30 IST