రాజమండ్రి: భారీ వర్షాల కారణంగా తూర్పుగోదావరి జిల్లాలోని బురదకాల్వ ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామం జలదిగ్బంధంలో ఉండిపోయింది. నిన్నటి నుంచి ముంపులో చిక్కుకున్న గ్రామంలో వందలాది ఇళ్లు ఉన్నాయి. విద్యుత్ సయపాయం లేక అంధకారంలో శ్రీరంగపట్నం ఎస్సీ కాలనీ వాసులు కొట్టుమిట్టాడుతున్నారు. గ్రామానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బురదకాల్వ వరదకు ఇసుక బస్తాలు కూడా వేయలేదని శ్రీరంగపట్నం గ్రామస్థులు మండిపడుతున్నారు. యేటా ఉండే ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు.