కాకినాడ: విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా కాకినాడ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరిన జనసేన నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కలెక్టరేట్ ముట్టడికి అనుమతి లేదని వాహనాలను అడ్డగించారు. కోనసీమ, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి బయలుదేరిన పార్టీ నేతలు, కార్యకర్తల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి