కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-09-22T18:08:02+05:30 IST

ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును కాకినాడ పోలీసులు రట్టు చేశారు.

కాకినాడలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు

తూర్పుగోదావరి: ఫేక్ కరెన్సీ ముఠా గుట్టును కాకినాడ పోలీసులు రట్టు చేశారు. కేంద్రం 2 వేల నోట్లను రద్దు చేయనున్న నేపథ్యంలో తమ దగ్గర ఉన్న రెండు వందల కోట్లను తక్కువకే ఇస్తామంటూ మోసం చేసేందుకు ముఠా యత్నించింది. రెండు వేల రూపాయల నోట్లు నిల్వ ఉన్న వీడియోను చూపించి మోసానికి పాల్పడింది. 90 లక్షల రూపాయల విలువైన 5 వందల రూపాయల నోట్లు ఇస్తే  కోటి రూపాయిల విలువైన  2 వేల రూపాయల నోట్లు ఇస్తామని కాకినాడకు చెందిన నాగ ప్రసాద్ అనే వ్యక్తిని ముఠా సభ్యులు నమ్మించారు. అనుమానం వచ్చి నాగ ప్రసాద్ పోలీసులకు  ఫిర్యాదు చేయడంతో నకిలీ కరెన్సీ ముఠా మోసం బయటపడింది. విశాఖ జిల్లాకు చెందిన నలుగురు ముఠా సభ్యులతో పాటు కాకినాడకు చెందిన మరొక నిందితుడిని సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Updated Date - 2020-09-22T18:08:02+05:30 IST