రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో వరద ప్రవాహం స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 8.40 అడుగులకు చేరింది. దీంతో అధికారులు తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు తొమ్మిది వేల క్యూసెక్కుల సాగు నీటిని విడుదల చేశారు. అలాగే 2.79 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సముద్రంలోకి విడుదల చేశారు.