ఐఎస్‌ఎల్‌లో ఈస్ట్‌ బెంగాల్‌

ABN , First Publish Date - 2020-09-28T10:54:22+05:30 IST

ఈ సీజన్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో కోల్‌కతాకు చెందిన ప్రముఖ క్లబ్‌ జట్టు ఈస్ట్‌ బెంగాల్‌ ఆడనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

ఐఎస్‌ఎల్‌లో ఈస్ట్‌ బెంగాల్‌

కోల్‌కతా: ఈ సీజన్‌ ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌)లో కోల్‌కతాకు చెందిన ప్రముఖ క్లబ్‌ జట్టు ఈస్ట్‌ బెంగాల్‌ ఆడనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. 1920లో ఈ క్లబ్‌ జట్టును ఏర్పాటు చేశారు. గోవాలో ఈ ఏడాది నవంబరు 21న ఐఎ్‌సఎల్‌ ప్రారంభం కానుంది. దీంతో ఈసారి ఈస్ట్‌ బెంగాల్‌తో సహా మొత్తం 11 జట్లు టైటిల్‌ కోసం పోటీపడనున్నాయి. ఇక మూడు వేదికల్లో జరిగే మ్యాచ్‌లకు కొవిడ్‌-19 నేపథ్యంలో ప్రేక్షకులను అనుమతించడం లేదు.

Updated Date - 2020-09-28T10:54:22+05:30 IST