AP: ఈజ్ ఆఫ్ డూయింగ్.. తన ఖాతాలో వేసుకునేందుకు YCP పాట్లు

ABN , First Publish Date - 2022-07-01T18:44:23+05:30 IST

వైసీపీ ప్రభుత్వం లేని గొప్పలకు పోతోంది. గత ప్రభుత్వం తెచ్చిన కీర్తిని తన ఖాతాలో వేసుకునేందుకు..

AP: ఈజ్ ఆఫ్ డూయింగ్.. తన ఖాతాలో వేసుకునేందుకు YCP పాట్లు

ఇంటర్‌నెట్ డెస్క్ (Internet desk): వైసీపీ (YCP) ప్రభుత్వం లేని గొప్పలకు పోతోంది. గత ప్రభుత్వం తెచ్చిన కీర్తిని తన ఖాతాలో వేసుకునేందుకు నానా పాట్లు పడుతోంది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాఫిక్‌గా మారుతోంది. ఇంతకీ జగన్ రెడ్డి (Jagan reddy) చెప్పుకుంటున్న ఆ గొప్పలేంటి? అసలు విషయం ఏంటి?..


కేంద్రం 2019 మార్చి వరకు ఈజ్ ఆఫ్ డూయింగ్ (Ease of doing) ర్యాంకులను ప్రకటించింది. వైసీపీ నేతలు ఇది తమ ప్రభుత్వ ఘనత అంటూ బాకా ఊదుతున్నారు. దేశంలో పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల అంశాలను కేంద్ర పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తోంది. దాని ఆధారంగా అన్ని రాష్ట్రాలకు ర్యాంకులిస్తోంది. ఈ ర్యాంకింగ్ ఆధారంగా పారిశ్రామిక వేత్తలు ఆయా రాష్ట్రాలకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ. ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ పరిగణించి పారిశ్రామిక వేత్తలు ఈ ర్యాంకింగ్‌ల ద్వారా ముందుకు వస్తారని కేంద్రం భావిస్తోంది.


2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అవశేష ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలు లేవు. పారిశ్రామిక అనుకూల వాతావరణం సృష్టించేందుకు అనాటి చంద్రబాబు ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. శ్రీసిటీ తిరుపతిలో అనేక పరిశ్రమాలతోపాటు అనంతపురంలో కియా, విశాఖలో ఐటీ వంటి పరిశ్రమలు తీసుకువచ్చారు. ఆ కృషి ఫలితంగా  2016, 17, 18, 2019లో ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచింది. ఢిల్లీలో బిజినెస్ రిఫార్మ్స్ యాక్షన్ ఫ్లాన్ 2020ని విడుదల చేశారు. ఇందులో ఏపీ మొదటి స్థానంలో ఉండగా టాప్ హెచీవర్స్‌గా ఏగుగురిని ప్రకటించారు. 


కరోనావల్ల రెండేళ్లపాటు ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులు విడుదల కాలేదు. వాటినే ఇప్పుడు కేంద్రం ప్రకటించింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇదంతా తమ ప్రతిభా అని సొంత మీడియాలో బాకా కొట్టడం ప్రారంభించింది. 2019 మార్చి వరకు కేంద్రం ఆయా రాష్ట్రాల పురోగతిని పరిగణలోకి తీసుకున్న డాక్యుమెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త పరిశ్రమల గురించి దేవుడెరుగు.. ఉన్న పరిశ్రమలే వెళ్లిపోయాయి. గతంలో వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి తెచ్చుకునేందుకు తంటాలు పడుతున్నా.. అవి తిరిగి రావడంలేదు. ఇటువంటి సమయంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ర్యాంక్ ఎలా వచ్చిందని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. 2019 మార్చి వరకు ఉన్న పారామీటర్స్‌ను పరిగణలోకి తీసుకుని ర్యాంకింగ్ ఇస్తే అది తమ ప్రతిభ అని డబ్బా కొట్టుకోవడం ఏంటని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.

Updated Date - 2022-07-01T18:44:23+05:30 IST