Advertisement
Advertisement
Abn logo
Advertisement
Sep 11 2021 @ 18:40PM

తొర్మామిడి, బొపునారం గ్రామాల్లో కంపించిన భూమి

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా బంట్వారం మండలంలోని తొర్మామిడి, బొపునారం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామాల్లో భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. శనివారం మధ్యాహ్నం 2.10 గంటలకు ఆరు సెకన్లపాటు భూమి ఒక్కసారిగా కంపించడంతో  ఒక్కసారిగా  భయాందోళనకు గురయ్యారు. ఎన్నడూ లేని విధంగా భూమి కంపించడంతో ఏం జరుగుతుందోనని భయం గుప్పిట్లో ప్రజలు ఉన్నారు. గత నెలరోజుల క్రితం తొర్మామిడికి 35కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి తాలుకాలోని కర్కిచెడ్‌ గ్రామంలో కూడా భూమి కంపించింది. ఆ సంఘటన జరిగిన కొద్దిరోజులకే మళ్లీ అదే సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించడంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. భూమి ఎంతమేర కంపించింది.. ఎందుకు కంపిస్తోందనే వివరాలు తెలియాల్సివుంది. 


Advertisement
Advertisement