Mexico:భారీ భూకంపం...ఊగిన భవనాలు

ABN , First Publish Date - 2021-09-08T13:59:37+05:30 IST

మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది....

Mexico:భారీ భూకంపం...ఊగిన భవనాలు

మెక్సికో సిటీ: మెక్సికో దేశంలో భారీ భూకంపం సంభవించింది. మెక్సికో దేశంలోని గెరెరో రాష్ట్రంలోని అకాపుల్కో బీచ్ రిసార్టుకు ఆగ్నేయంగా 14కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉంది. నైరుతి మెక్సికోలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.9గా నమోదైంది. ఈ భూకంపం వల్ల వందల కిలోమీటర్లదూరంలో భవనాలు ఊగాయి.అనేక వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజధానిలోని భవనాలు వణుకుతున్నాయని నేషనల్ సీస్మోలాజికల్ సర్వీస్ తెలిపింది. ఈ భూకంపం వల్ల నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవని మెక్సికో సిటీ మేయర్ క్లాడియా షీన్‌బామ్ ట్విట్టర్‌లో తెలిపారు.మెక్సికో ప్రపంచంలోని అత్యంత భూకంప చురుకైన ప్రదేశాల్లో ఒకటి. 1985 సెప్టెంబరు 19వతేదీన సంభవించిన తీవ్ర భూకంపం వల్ల 10వేలమందికిపైగా మరణించగా, వందలాది భవనాలు కుప్పకూలాయ.2017లో సంభవించిన భూకంపంలో 370 మంది మరణించారు. 

Updated Date - 2021-09-08T13:59:37+05:30 IST