Advertisement
Advertisement
Abn logo
Advertisement
Apr 6 2021 @ 07:10AM

అసోంలోను మళ్లీ భూప్రకంపనలు

తిన్ సుకియా (అసోం): అసోం రాష్ట్రంలోని తిన్ సుకియా సమీపంలో మంగళవారం తెల్లవారుజామున 3.42 గంటలకు భూమి కంపించింది. తిన్ సుకియా ప్రాంతంలో సంభవించిన భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. అసోంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి.దీంతో నిద్రపోతున్న ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు.సిక్కిం-నేపాల్ సరిహద్దుల్లో సోమవారం రాత్రి 8.49 గంటలకు భూకంపం సంభవించింది. సిక్కింలో సంభవించిన భూకంపంపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. అసోంలో తరచూ భూమి కంపిస్తుండటంతో ఇక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందుతున్నారు.

Advertisement
Advertisement