ఇండోనేషియాలో భూకంపం..సునామీ ముప్పు లేదు

ABN , First Publish Date - 2020-07-07T13:21:57+05:30 IST

ఇండోనేషియా దేశ ప్రధాన ద్వీపం అయిన జావా తీరంలోని సముద్రగర్భంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది....

ఇండోనేషియాలో భూకంపం..సునామీ ముప్పు లేదు

జకార్తా (ఇండోనేషియా): ఇండోనేషియా దేశ ప్రధాన ద్వీపం అయిన జావా తీరంలోని సముద్రగర్భంలో మంగళవారం తీవ్ర భూకంపం సంభవించింది. ఈ భూకంపం సముద్ర గర్భంలో 528 కిలోమీటర్ల లోతులో కేంద్రీకతమై ఉందని ఇండోనేషియా వాతావరణ, జియోఫిజిక్స్ అధికారులు చెప్పారు. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1 గా నమోదైంది. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగలేదని ఇండోనేషియా అధికారులు చెప్పారు. భూకంపం వల్ల సునామీ వచ్చే ప్రమాదం లేదని శాస్త్రవేత్తలు చెప్పారు. సెంట్రల్ జావా ప్రావిన్సులోని తీర ప్రాంత పట్టణమైన బటాంగ్ కు ఉత్తరాన సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 6.6గా నమోదైందని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 2004లో హిందూమహా సముద్రంలో సంభవించిన భూకంపం, అగ్నిపర్వత విస్పోటనం వల్ల సునామీ రావడంతో 12 దేశాల్లో 2,30,000 మంది మరణించారు. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని తవాంగ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున 1.33 గంటలకు భూమి కంపించింది.తరచూ ఈశాన్య రాష్ట్రాల్లో భూప్రకంపనలు సంభవిస్తూనే ఉన్నాయి. 

Updated Date - 2020-07-07T13:21:57+05:30 IST