అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూకంపం

ABN , First Publish Date - 2021-06-21T16:18:54+05:30 IST

గతకొన్ని రోజులుగా దేశంలోని...

అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌లో భూకంపం

ఈటాన‌గ‌ర్‌: గతకొన్ని రోజులుగా దేశంలోని ఈశాన్య రాష్ట్రాల్లో త‌ర‌చూ భూకంపాలు సంభ‌విస్తున్నాయి. తాజాగా ఈరోజు ఉద‌యం అరుణాచల్‌ప్రదేశ్‌లో భూకంపం సంభవించింది. ఈటానగర్‌లో ఉదయం 6 గంట‌ల 9 నిముషాల‌కు  భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై మూడు పాయింట్లుగా న‌మోద‌య్యింది. అయితే ఈ భూకంపం కార‌ణంగా ఎటువంటి ప్రాణనష్టం సంభ‌వించ‌లేదు. కాగా శ‌నివారం అరుణాచల్‌ప్రదేశ్‌లోని పాంగిన్‌లో  భూకంపం సంభవించింది. దాని తీవ్రతను రిక్టర్ స్కేల్‌పై 3.1గా న‌మోదైంది. అదేవిధంగా శనివారం రాత్రి మణిపూర్‌లోని శిరుయ్ గ్రామంలో కూడా భూకంపం సంభవించింది. దీని తీవ్ర‌త 3.6 గా న‌మోద‌య్యింది. ఈ రెండు భూకంపాల కార‌ణంగా ఎటువంటి ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. దీనికిముందు శుక్రవారం రాత్రి అసోంలో 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. 

Updated Date - 2021-06-21T16:18:54+05:30 IST