ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భూకంపం.. జమ్మూకశ్మీర్‌‌లోనూ ప్రకంపనలు

ABN , First Publish Date - 2022-01-02T02:08:05+05:30 IST

ఆప్ఘనిస్థాన్-తజకిస్థాన్ సరిహద్దులో ఈ (శనివారం) సాయంత్రం గంటలకు భారీ భూకంపం సంభవించింది

ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భూకంపం.. జమ్మూకశ్మీర్‌‌లోనూ ప్రకంపనలు

కాబూల్: ఆప్ఘనిస్థాన్-తజకిస్థాన్ సరిహద్దులో ఈ (శనివారం) సాయంత్రం 6.45 గంటలకు భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.1గా నమోదైంది. అలాగే, నియంత్రణ రేఖ వెంబడి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సహా ఇతర ప్రాంతాల్లోనూ ప్రకంపనలు కనిపించాయి. ఈ విషయాన్ని జాతీయ భూకంప కేంద్రం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. భూ ప్రకంపనలతో భయపడిన జనం ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. అయితే, ప్రాణ, ఆస్తినష్టానికి సంబంధించి ఎలాంటి వార్తలు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - 2022-01-02T02:08:05+05:30 IST