మూడు గంటల్లో రెండు రాష్ట్రాల్లో భూకంపం... బీకానేర్‌లో 5.3 తీవ్రత నమోదు!

ABN , First Publish Date - 2021-07-21T13:15:59+05:30 IST

దేశంలోని రెండు రాష్ట్రాల్లో కొద్ది గంటల వ్యవధిలో భూకంపం...

మూడు గంటల్లో రెండు రాష్ట్రాల్లో భూకంపం... బీకానేర్‌లో 5.3 తీవ్రత నమోదు!

న్యూఢిల్లీ: దేశంలోని రెండు రాష్ట్రాల్లో కొద్ది గంటల వ్యవధిలో భూకంపం సంభవించింది. రాజస్థాన్‌లోని బీకానేర్‌లో 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. అలాగే మేఘాలయలోనూ భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం రాజస్థాన్‌లోని  బీకానేర్‌లో ఈరోజు ఉదయం 5 గంటల 24 నిముషాలకు భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి.


రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయ్యింది. అలాగే మేఘాలయలోని వెస్ట్ గారె హిల్స్ ప్రాంతంలో తెల్లవారు జామున 2 గంటల 10 నిముషాలకు భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.1గా నమోదయ్యింది. దీనికిముందు గుజరాత్‌లోని కచ్ ప్రాంతంలో భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూపంప తీవ్రత 3.9గా నమోదయ్యింది. దీనికన్నా ముందు ఇదే నెలలో హిమాచల్ ప్రదేశ్, అసోం, బెంగాల్, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో భూకంపాలు చోటుచేసుకున్నాయి.

Updated Date - 2021-07-21T13:15:59+05:30 IST