earthquake: తైవాన్‌లో మూడు రోజుల్లో మూడోసారి భూకంపం...పట్టాలు తప్పిన రైళ్లు

ABN , First Publish Date - 2022-09-19T14:19:23+05:30 IST

తైవాన్(Taiwan) దేశం వరుస భూకంపాలతో(earthquake) అతలాకుతలం అయింది....

earthquake: తైవాన్‌లో మూడు రోజుల్లో మూడోసారి భూకంపం...పట్టాలు తప్పిన రైళ్లు

తైపీ(తైవాన్): తైవాన్(Taiwan) దేశం వరుస భూకంపాలతో(earthquake) అతలాకుతలం అయింది. కేవలం మూడు రోజుల్లో మూడు సార్లు భూకంపం సంభవించింది. సోమవారం ఉదయం తైవాన్ దేశంలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6గా నమోదైందని యూరోపియన్ మెడిటెర్రేనియన్ సీస్మాలజీ సెంటరు(European- Mediterranean Siesmological Centre) తెలిపింది. భూకంపం కేంద్రం 2 కిలోమీటర్ల లోతులో ఉందని సీస్మాలజీ సెంటర్ అధికారులు చెప్పారు. తైవాన్‌లోని హువాలియన్ కౌంటీలోని యులిలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం కారణంగా పెద్ద భవనం కూలిపోయింది.(collapsed building) కూలిపోయిన భవనంలో నుంచి నలుగురిని రక్షించారు.భూకంపం వల్ల పలు రైళ్లు పట్టాలు తప్పాయి.(derailing train carriages)


భూకంపం వల్ల పర్వత రహదారులు మూసుకు పోయి 600 మంది చిక్కుకుపోయారు.భూకంపం కారణంగా ఒకరు మరణించారని,మరో 146 మంది గాయపడ్డారని తైవాన్ అగ్నిమాపక విభాగం తెలిపింది.తూర్పు తైవాన్‌లోని డోంగ్లీ స్టేషన్‌లో ప్లాట్‌ఫారమ్ పై కొంత భాగం కూలిపోవడంతో ఆరు బోగీలు పట్టాలు తప్పాయి.రాజధాని తైపీలో కొద్దిసేపు భవనాలు కంపించాయి2016వ సంవత్సరంలో దక్షిణ తైవాన్‌లో సంభవించిన భూకంపంలో 100 మందికి పైగా మరణించారు. 1999లో 7.3 తీవ్రతతో సంభవించిన భూకంపం వల్ల 2,000 మందికి పైగా మరణించారు.


Updated Date - 2022-09-19T14:19:23+05:30 IST