Advertisement
Advertisement
Abn logo
Advertisement
Nov 20 2021 @ 07:45AM

Rajasthan రాష్ట్రంలో భూప్రకంపనలు...భయాందోళనల్లో ప్రజలు

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్, జోధ్‌పూర్ ప్రాంతాల్లో తెల్లవారుజామున సంభవించిన భూకంపం వల్ల ఇళ్లలో నిద్రపోతున్న ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. భూ ప్రకంపనలతో ప్రజలు ఇళ్లలో నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. జాలోర్‌లో శనివారం తెల్లవారుజామున 2.26 గంటలకు భూకంపం సంభవించింది. ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. జోధ్‌పూర్ నగరంలోనూ భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతులో నుంచి వచ్చిన భూకంపం వల్ల ప్రజలు తెల్లవారుజామున బిక్కుబిక్కుమంటూ గడిపారు.ఈ భూకంపం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రాజస్థాన్ అధికారులు చెప్పారు.


Advertisement
Advertisement