అయోధ్య(ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య సమీపంలో భూకంపం సంభవించింది.గురువారం అర్దరాత్రి అయోధ్యలో సంభవించిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ శుక్రవారం ఉదయం తెలిపింది. అయోధ్య నగరానికి 176 కిలోమీటర్ల దూరం సంభవించిన భూకంపంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఈ భూకంపం 15కిలోమీటర్ల లోతులో వచ్చిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ అధికారులు ట్వీట్ చేశారు.గాఢనిద్రలో ఉన్న జనం భూప్రకంపనలతో ఆందోళన చెందారు.
ఇవి కూడా చదవండి