Abn logo
Sep 8 2020 @ 07:17AM

లదాక్, అండమాన్-నికోబార్ దీవుల్లో భూకంపం

Kaakateeya

న్యూఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా విజృంభిస్తుండగా, మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తరచూ భూకంపాలు చోటుచేసుకుంటున్నారు. ఈరోజు ఉదయం లదాక్, అండమాన్-నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. లదాక్‌లో భూకంప తీవ్రత 4.4గా నమోదు కాగా, అండమాన్- నికోబార్ దీవుల్లో 4 పాయింట్ల తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఇప్పటి వరకూ ఈ రెండు ప్రాంతాల్లో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు తెలియరాలేదు.

మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈరోజు తెల్లవారుజామున 3 గంటలకు అండమాన్- నికోబార్ దీవుల్లో మరోమారు భూకంపం సంభవించింది. డిగలీపూర్‌లో భూకంప ప్రభావం కనిపించింది. అలాగే లదాక్‌లోని కార్గిల్‌కు 435 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఉదయం 5. 47 గంటలకు భూమి కంపించింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపిన వివరాల ప్రకారం ఈ రెండు ప్రాంతాల్లో భూకంపం సంభవించినప్పటికీ ఎటువంటి నష్టం వాటిల్లలేదు.

Advertisement
Advertisement