Empty earth: భూమ్మీద మనుషులు దాదాపుగా లేనట్టే: ఎలాన్ మస్క్

ABN , First Publish Date - 2022-07-22T01:26:32+05:30 IST

భూమ్మిద మనుషులు దాదాపుగా లేనట్టేనని అపరు కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ఇటీవల కామెంట్ చేశారు.

Empty earth: భూమ్మీద మనుషులు దాదాపుగా లేనట్టే: ఎలాన్ మస్క్

ఎన్నారై డెస్క్: భూమ్మిద మనుషులు దాదాపుగా లేనట్టేనని అపరు కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్(Elon musk) ఇటీవల కామెంట్ చేశారు. వివిధ దేశాల్లోని జనసాంద్రతతను తెలియజేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ అయిన ఓ ట్వీట్‌పై మస్క్ ఇలా స్పందించారు. ‘‘భూమ్మిద మనుషులు దాదాపుగా లేనట్టే(Empty Earth).. అంతా ఖాళీగా ఉన్నట్టు ఉంది..’’ అని ఓ పోస్ట్ చేశారు. మానవసమాజ మనుగడకు అవసరమైన స్థాయిలో జనాభాలేదని మస్క్ తరచూ చెబుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ తొమ్మిది మంది పిల్లలకు జన్మనిచ్చిన ఆయన.. జనాభా తగ్గుదలను అడ్డుకునేందుకు తనకు చేతనైనంతా చేస్తున్నానని ఇటీవలే కామెంట్ చేశారు. 


తన సంస్థ న్యూరాలింక్‌లోని ఉన్నతోద్యోగి షివోన్ జిలిస్‌తో కలిసి ఇటీవల మస్క్ కవలల్ని కన్న విషయం తెలిసిందే. ఆ పిల్లల పేరు మార్పుకు సంబంధించిన కోర్టులో దాఖలైన పిటిషన్‌ గురించి ఓ పత్రిక బయటపెడ్డంతో మస్క్ సంతానం గురించి ప్రపంచానికి తెలిసింది. ఇక మస్క్ తండ్రి ఎర్రోల్ మస్క్ కూడా తనయుడికి తగ్గట్టుగానే.. ప్రపంచజనాభా పెంచేందుకు ఇతోధికంగా కృషి చేస్తున్నారు. గతంలో మస్క్ తండ్రి తన కుటుంబంలోని ఓ మహిళతో కలిసి ఓ బిడ్డను కన్నారు. ఈ విషయాన్ని ఇటీవలే ఎరోల్ మస్క్ వెల్లడించారు. అంతేకాకుండా.. ఆ తరువాత మరో సందర్భంలో మనుషులు భూమ్మిద ఉన్నది పిల్లల్ని కంటానికేనని కూడా తేల్చి చెప్పారు. 



Updated Date - 2022-07-22T01:26:32+05:30 IST