30 గంటల ప్లేబ్యాక్‌తో ఇయర్‌ ఫోన్స్‌

ABN , First Publish Date - 2022-06-11T05:57:41+05:30 IST

చేతిలో సెల్‌, చెవులకు అనుసంధానం చేస్తూ ఇయర్‌ఫోన్‌ ఈ రోజుల్లో సర్వసాధారణం. అలాగే సరికొత్త హంగులతో...

30 గంటల ప్లేబ్యాక్‌తో ఇయర్‌ ఫోన్స్‌

చేతిలో సెల్‌, చెవులకు అనుసంధానం చేస్తూ ఇయర్‌ఫోన్‌ ఈ రోజుల్లో సర్వసాధారణం. అలాగే సరికొత్త హంగులతో ఎప్పటకప్పుడు సరికొత్త ఇయర్‌ ఫోన్స్‌ మార్కెట్లో దర్శనమిస్తున్నాయి. ఆ వరుసలోదే వన్‌ప్లస్‌ బుల్లెట్స్‌ వైర్‌లెస్‌ జెడ్‌2 ఇయర్‌ ఫోన్లు. మేజికో బ్లాక్‌, బ్లూ బీమ్‌ రంగుల్లో విడుదలయ్యాయి. ధర రూ.1,999. దీని ముందు వెర్షన్‌తో పోల్చుకుంటే ధ్వని సహా అన్ని ఫీచర్లు ఘనంగానే ఉన్నాయి. రోజంతా దీని బ్యాటరీ ఉపయోగపడుతుంది. నాయిస్‌ కాన్సిలేషన్‌ ఫీచర్‌కు తోడు ఏఐ పవర్డ్‌ అల్గోరిథమ్‌తో ధ్వనిలో స్పష్టత బాగుంది. రేటు కూడా అందుబాటులో ఉంది. ఇందులోని ఫీచర్లు ఎక్కువ హై ఎండ్‌ ఇయర్‌ ఫోన్లలో మాత్రమే ఉంటాయి. వర్షం, ఆఫీసుకు వెళుతున్నప్పుడు అదీ డ్రైవ్‌లో ఉన్నప్పుడు కూడా ధ్వనిలో స్పష్టత ఉంటుంది. 20ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉంది. దాంతో ఫుల్‌ చార్జింగ్‌తో 30 గంటల ప్లేబ్యాక్‌ లభిస్తుంది. కేవలం పది నిమిషాల చార్జింగ్‌తో 20 గంటల సేపు ఉపయోగించుకోవచ్చు. 12.4 ఎంఎం డ్రైవర్స్‌ పవర్‌ కలిగి ఉంది. దాంతో సౌండ్‌ క్వాలిటీ చాలా బాగుంటుంది. ఎకో ఫ్రెండ్లీ నెక్‌బ్యాండ్‌ కావడంతో స్కిన్‌ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఐపీ55 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ రేటింగ్‌ ఉంది. హైడ్రోఫోబిక్‌ నానో కోటింగ్‌ ఉండటంతో తడి పరిస్థితుల్లోనూ ఇబ్బంది ఉండదు. వన్‌ ప్లస్‌ వెబ్‌సైట్‌ లేదంటే ఆథరైజ్డ్‌ స్టోర్‌ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు. 

Updated Date - 2022-06-11T05:57:41+05:30 IST