west bengal మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్వీప్

ABN , First Publish Date - 2022-02-14T16:23:26+05:30 IST

పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది...

west bengal మున్సిపల్ ఎన్నికల్లో టీఎంసీ క్లీన్ స్వీప్

సిలిగురి (పశ్చిమబెంగాల్): పశ్చిమబెంగాల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది.సిలిగురి,అసన్ సోల్, బిధాననగర్, చందన్ నగర్ మున్సిపాలిటీల్లో శనివారం జరిగిన మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది.నాలుగు మున్సిపాలిటీల్లోనూ టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బిధాన్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 41 డివిజన్లలో 40 స్థానాల్లో టీఎంసీ అధ్యర్థులు ప్రత్యర్థి పక్షాల కంటే ఆధిక్యంలో ఉన్నారు. ఒక్క మున్సిపల్ డివిజన్ లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి మెజార్టీ సాధించారు.సిలిగురి మున్సిపాలిటీలో 47 స్థానాల్లో 31 స్థానాల్లో టీఎంసీ అభ్యర్థులు విజయం వైపు దూసుకుపోతున్నారు. చందన్ నాగోర్ మున్సిపాలిటీలో 19 స్థానాల్లో అధికార టీఎంసీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.అసన్ సోల్ మున్సిపాలిటీలో అత్యధికంగా 50 సీట్లలో టీఎంసీ అభ్యర్థులు విజయ పథాన పయనిస్తున్నారు.


Updated Date - 2022-02-14T16:23:26+05:30 IST