ముందస్తు వర్షాలు.. ముమ్మరంగా వేసవి దుక్కులు

ABN , First Publish Date - 2022-05-25T05:23:07+05:30 IST

మండలంలో ఇటీవల కురిసిన ముందస్తు వ ర్షాలతో రైతన్నలు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. సే ద్యం పనులు ముమ్మరం చేశారు.

ముందస్తు వర్షాలు.. ముమ్మరంగా వేసవి దుక్కులు
ఆర్‌ మరువపల్లిలో ట్రాక్టర్‌తో దుక్కి దున్నుతున్న దృశ్యం

రొద్దం, మే 24: మండలంలో ఇటీవల కురిసిన ముందస్తు వ ర్షాలతో రైతన్నలు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. సే ద్యం పనులు ముమ్మరం చేశారు. మండలవ్యాప్తంగా కురిసిన వర్షంతో పలు చెరువులకు నీరు చేరింది. దీంతో భూగర్భ జలాలు పె రుగుతాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చాలా గ్రామాల్లో కాడెద్దులు లేకపోవడంతో ట్రాక్టర్ల ద్వారా దుక్కులు దున్ని పొలా న్ని సిద్ధం చేసుకుంటున్నారు. ట్రాక్టర్‌ బాడుగ గంటలకు రూ. వెయ్యి వరకూ పెంచేశారు. ఎక్కువమంది రైతులు కందిపంటను సాగు చేయడానికి మొగ్గుచూపుతున్నారు. గత యేడాది కందిపం ట అధిక వర్షాలతో పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం ఎలాంటి నష్టపరిహారం అందించలేదు. కనీసం బీమా అందించి ప్రభుత్వం ఆ దుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. 


విత్తన వేరుశనగకు మొగ్గుచూపని రైతులు

 మండల వ్యాప్తంగా రాయితీ విత్తన వేరుశనగ కోసం రైతులు ఆర్బీకేల్లో రిజిస్ర్టేషన్లు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు కేవలం 23 మంది రైతులు మాత్రమే విత్తన వేరుశనగ కోసం రిజిస్ర్టేషన చే యించుకున్నారు. గతంలో రైతులు విత్తనాల కోసం రాత్రంతా జాగరణ చేసి, క్యూలో నిలబడినా దొరకని పరిస్థితి ఉండేది. అయితే రా ను రాను రైతులు వేరుశనగ పంటను సాగుచేయడమే మరిచిపోతున్నారు. పెరిగిన పెట్టుబడి ఖర్చులు, కూలీల సమస్య, పంటల దిగుబడి తగ్గిపోవడం, వర్షాభావ పరిస్థితులు వెరసి వేరుశనగ పం టను రైతులు సాగు చేయడం లేదు. మండలవ్యాప్తంగా 23మంది రైతులకు గాను 20 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల కోసం ఆర్బీకేలో రిజిస్ర్టేషన చేసుకున్నట్లు వ్యవసాయాధికారి నివేదిత తెలిపారు. రొద్దం ఆర్బీకే-1లో కేవలం ఇద్దరు రైతులు మాత్రమే రిజిష్టరు చేయించుకున్నారు. 


Updated Date - 2022-05-25T05:23:07+05:30 IST