ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

ABN , First Publish Date - 2022-03-10T14:59:52+05:30 IST

దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు....

ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తాజా ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

యూపీలో బీజేపీ, పంజాబ్‌లో ఆప్ అభ్యర్థుల ముందంజ

న్యూఢిల్లీ: దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు పర్వంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్థులు ముందంజలో దూసుకుపోతున్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గోవా ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో హోరాహోరీ పోరు సాగుతోంది. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాల్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ భావిస్తోంది. పంజాబ్‌లో అధికార కాంగ్రెస్‌కు పెద్ద పరీక్ష ఎదురైంది.403 మంది సభ్యులున్న అసెంబ్లీలో బీజేపీ మెజారిటీ సాధిస్తే, మూడు దశాబ్దాలకు పైగా వరుసగా రెండోసారి అధికారంలో ఉన్న తొలి పార్టీ అవుతుంది.17 మంది సభ్యుల పంజాబ్ అసెంబ్లీలో కాంగ్రెస్ నంబర్ 2 స్థానానికి పడిపోయింది.


పంజాబ్‌లో ఎన్నికలకు ముందు ఏడాదికి పైగా కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిపోయింది. మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్,రాజకీయవేత్తగా మారిన క్రికెటర్ నవజ్యోత్ సిద్ధూల మధ్య జరిగిన యుద్ధంతో ఆ పార్టీ తీవ్రంగా నష్ట పోయింది. అమరీందర్ సింగ్ కొత్త పార్టీ పంజాబ్ లోక్ కాంగ్రెస్ బీజేపీతో చేతులు కలిపింది.గోవాలో కాంగ్రెస్ కంటే తక్కువ సీట్లు వచ్చినప్పటికీ బీజేపీ ఐదేళ్ల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది. మిత్రపక్షాల మద్ధతు పొందటానికి ఇరు పార్టీలు పోటీపడుతున్నాయి. 


ప్రస్తుతం తృణమూల్ కాంగ్రెస్‌తో పొత్తులో ఉన్న మాజీ మిత్రపక్షం మహారాష్ట్రవాది గోమతక్ పార్టీ (ఎంజిపి) మద్దతు తమకు ఉంటుందని బీజేపీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది.ఉత్తరాఖండ్‌లో 60 స్థానాలకు గాను 21 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్‌ 19 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి.


Updated Date - 2022-03-10T14:59:52+05:30 IST