గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలా?.. అరవింద్ కేజ్రీవాల్ సందేహాలు

ABN , First Publish Date - 2022-05-01T02:42:26+05:30 IST

న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గు

గుజరాత్‌లో ముందస్తు ఎన్నికలా?.. అరవింద్ కేజ్రీవాల్ సందేహాలు

న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గుజరాత్‌ బీజేపీ అగ్రనాయకత్వం ప్రధాని మోడీతో శనివారం 2 గంటలకుపైగా సుధీర్ఘ భేటీ జరపడంపై ఆయన సందేహాలు వ్యక్తం చేశారు. వచ్చేవారమే గుజరాత్ అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలను ప్రకటించబోతున్నారా అని బీజేపీ నేతలను ప్రశ్నించారు. ఆప్‌కి ఇంతలా భయపడుతున్నారా? అని వ్యంగాస్త్రాలు సంధించారు. ఈ మేరకు హిందీలో ట్వీట్ చేశారు.


కాగా ప్రధాని మోడీ నివాసంలో జరిగిన ఈ భేటీలో కేంద్ర హోమంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, రాష్ట్రమంత్రి రాజేంద్ర త్రివేదితోపాటు రాష్ట్ర చీఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీ కే.కైలాష్‌నాథన్ పాల్గొన్నారు. ఈ ఏడాది చివరిలో గుజరాత్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన ఆప్ పార్టీ మంచి ఊపుమీద ఉంది. గుజరాత్‌ ఎన్నికల్లో అన్ని సీట్లలోనూ పోటీ చేసి చక్కటి ఓటు బ్యాంక్ సాధించాలనుకుంటోంది. ప్రణాళికలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గుజరాత్‌లో శనివారం రాత్రి నుంచి 2 రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు.

Updated Date - 2022-05-01T02:42:26+05:30 IST